- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా చేస్తే మాపార్టీ వారిని శిక్షించండి: కేటీఆర్
దిశ, నల్లగొండ: హైదరాబాద్-విజయవాడ మధ్య బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తే రెండు రాష్ట్రాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హుజూర్ నగర్‌లో నూతన ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టేవారి పట్ల కఠినంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముందుగా చర్యలు తీసుకోవాల్సి వస్తే తమ పార్టీ వారిపైనే తీసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి చిట్యాల విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, గాదరి కిషోర్ కుమార్, నలమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.