- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర ప్రయోజనాల అంశంలో రాజీపడబోం : కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్ :సామాజిక మాద్యమాల్లో తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ చురుకుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ASK ME పేరుతో ట్విట్టర్‌లో నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు ఆయన పలు సమాధానాలు చెప్పారు. అవి ఈ విధంగా ఉన్నాయి.
ముందుగా ఏపీ సీఎం గురించి మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమన్నారు. ఇంకో ప్రశ్నకు.. కేసీఆర్ తర్వాత తనకు ఇష్టమైన లీడర్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అని సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను ప్రజలు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకురాగా.. ఆయన ఆయా శాఖలను అప్రమత్తం చేశారు.
కరోనా కాలంలో ప్రైవేట్ ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ.. ఇప్పటికే పలు ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని, మరికొన్నింటిపై కూడా తీసుకుంటామన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పించామన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి చికిత్స అందిస్తున్నందున వాటిని వినియోగించుకోవాలన్నారు.
ప్రస్తుతం రోజుకు 23వేల కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, త్వరలోనే ఈ సంఖ్యను 40వేలకు పెంచుతామన్నారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ మెరుగైన పథకమని చెప్పారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం కొత్తగా 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని.. అన్ని ఏరియా ఆస్పతుల్లో ఐసీయూ యూనిట్స్ పెంచామని.. ఉచితంగా డయాలసిస్ కూడా చేస్తున్నట్లు తెలిపారు. రాజధానిలోనే 200 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామన్నారు.