- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాయిని మృతి కలిచివేసింది : కేటీఆర్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని కుటుంబ సభ్యులను ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన లేని లోటు పార్టీకి తీరని లోటన్నారు. కాగా తాజాగా నాయిని మృతిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. గురువారం ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ‘ఉద్యమ నేతగా, తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి వెంట నిలిచిన జన నాయకులు, కార్మిక పక్షపాతిగా, తెలంగాణ మొదటి హోం మంత్రిగా మనందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు నాయిని నరసింహా రెడ్డి గారు. వారి మృతి అందరినీ తీవ్రంగా కలిచివేసింది.’అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Next Story