- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటే.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందే
దిశ,వెబ్‌డెస్క్: పార్టీ సంస్థాగత ఎన్నికలపై ఫోకస్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధు, బీమా దేశంలో భాగంగా ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. పుట్టుక నుంచి చావు వరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
పనిలో పనిగా కేటీఆర్ బుల్లెట్ లాంటి మాటలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించిన పార్టీని తరిమేశాం. మతం, కులం పేరుతో కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయి. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము ఏ పార్టీకి లేదు. ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాయి.
తెలంగాణ ఉద్యమం కోసం బీజేపీ, కాంగ్రెస్ లో ఎవరైనా రాజీనామా చేశారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీ బతుకేంటో తెలుసుకోవాలి. ఏపీ నాయకుల ముందు చేతులు కట్టుకునే వాళ్లు ఇప్పుడు విర్రవీగుతున్నారు. నోటికి ఎంత వస్తే అంతమాట్లాడతారా. మేం కూడా ప్రధాని, కేంద్రమంత్రులను తిట్టొచ్చు.. మా సహనాన్ని పరీక్షించొద్దు. ముఖ్యమంత్రులనే పరిగెత్తించి కొట్టిన ఘనత టీఆర్ఎస్దే. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటే.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందన్న చందంగా ఒకట్రెండు సీట్లు రాగానే కొంతమంది ఎగిరిపడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.