- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రమంత్రులకు కేటీఆర్ సూటి ప్రశ్న !
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉన్నారని వ్యాఖ్యానిస్తున్న కేంద్రమంత్రులు ఆరేళ్లుగా చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వారికి ఆధార్ కార్డు, వీసా, పాస్‌పోర్టు ఇచ్చింది మీరేనని ఆరోపించారు. గురువారం నిజాం క్లబ్‌లో మ్యాక్ ప్రాజెక్ట్స్ ఎండీ మీర్ నాజిర్ అలీ ఖాన్‌తో ‘విశ్వనగరంగా హైదరాబాద్’ అనే అంశంపై జరిగిన సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే సాయం చేయాలని సీఎం కేసీఆర్ లేఖ రాస్తే కేంద్రం ఒక్కరూపాయి ఇవ్వలేదని, అదే కర్ణాటక ప్రభుత్వం లేఖరాస్తే నాలుగు రోజుల్లోనే ఇచ్చారన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించామన్న మంత్రి కేటీఆర్.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టామని, వాటి గురించి చెప్పడానికి 100గంటలైన సరిపోదన్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు ఓ ప్రత్యేకత ఉందని, నగరంలో ఎన్నో ప్రఖ్యాత కట్టడాలు ఉన్నాయన్నారు.