- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లంతో కేటీఆర్ ప్రత్యేక భేటీ… ఆంతర్యమేంటీ..?
దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిస్టులకు ఇండ్లు పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నట్టు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం జర్నలిస్టుల సమస్యలపై మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి ప్రెస్ అకాడమీకి రావాల్సిన బకాయిల చెల్లింపు, జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు, హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సోసైటీకి పేట్‌బషీరాబాద్‌లో స్థలం కేటాయింపు, చిన్న పత్రికల గ్రేడింగ్‌తో పాటు పలు సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా కరోనా సమయంలో వైరస్ బారీన పడ్డ జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున రూ. 20 వేలు అందజేసిన అల్లం నారాయణను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7న చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో అందజేసే సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరగా అందుకు మంత్రి ఒప్పుకున్నారు. మొత్తం 75 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, దీర్ఘకాలిక అనారోగ్య, ప్రమాదాల బారిన పడిన 15 మంది జర్నలిస్టులకు రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందించనున్నారు. అంతేకాకుండా, జర్నలిస్టుల సమస్యలన్నింటినీ కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని.. ఇళ్ల సమస్యను పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నట్టు కేటీఆర్ తెలిపారు.
ఎక్కడా లేని విధంగా తెలంగాణలో: అల్లం నారాయణ
అనంతరం మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు సంక్షేమ నిధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా గత మూడు ఆర్థిక సంవత్సరాలలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ. 34 కోట్ల 50 లక్షలు విడుదలయ్యాయని చెప్పారు. ఇప్పటికే, సంక్షేమనిధి కింద 260 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్షచొప్పున రూ. 2 కోట్ల 60 లక్షల ఆర్థిక సాయం అందజేశామని, ఆయా కుటుంబాలకు ప్రతి నెలకు రూ. 3వేల చొప్పున పెన్షన్‌ను 5 ఏళ్ల పాటు అందజేస్తున్నామన్నారు.
అంతేకాకుండా, వారి పిల్లలను ఎల్‌కేజీ నుండి పదవతరగతి వరకు చదువుకున్న 145 మంది విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ట్యూషన్ ఫీజును ఇస్తున్నామని చెప్పారు. దీంతో పాటు తీవ్ర అనారోగ్య కారణంగా పనిచేయలేని 93 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున రూ. 46,50,000 ఆర్థిక సహాయాన్ని సంక్షేమ నిధి నుంచి ప్రెస్ అకాడమీ అందజేసిందన్నారు. అలాగే, కరోనా బారీన పడ్డ 1927 మంది జర్నలిస్టులకు రూ. 20 వేల చొప్పున రూ. 3 కోట్ల 56 లక్షల 70 వేల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. ఇప్పటి వరకు జర్నలిస్ట్ సంక్షేమ నిధి నుంచి రూ. 9 కోట్ల 84 లక్షల 7 వేల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందజేశామని అల్లం నారాయణ వెల్లడించారు.
ఈ కీలక సమావేశంలో కేటీఆర్‌తో పాటు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, బాల్క సుమన్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టీఈఎంజేయూ అధ్యక్ష, కార్యదర్శులు ఇస్మాయిల్, రమణ, హైద్రాబాద్ యూనిట్ అధ్యక్షుడు యోగనందం, ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ పాల్గొన్నారు.