- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటల ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నదో చెప్పాలి.. కొప్పుల కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన కొప్పుల ఎన్నారైల సమావేశంలో ఈటల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని అన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రెండ్రోజుల నుంచి ఈటల రాజేందర్ చాలా విషయాలు మాట్లాడారని, పార్టీలో ఈటల రాజేందర్‌కు మొదటి నుంచి అత్యంత ప్రాధాన్యత ఉందని గుర్తుచేశారు.
ఈటలను గౌరవించి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అవకాశాలు ఇచ్చారని, పార్టీలో ప్రాధాన్యత లేదని ఈటల అనడం సత్యదూరమైన మాటలని విమర్శించారు. అన్ని రంగాల వారికి మంత్రి వర్గంలో స్థానం కల్పించిన ఘనత కేసీఆర్‌ది అని వెల్లడించారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఈటల ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని, ఈటల ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నదో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. పార్టీపై ఈటల అనేక విమర్శలు చేస్తున్నారని, ఇది క్రమశిక్షణ కాదని, దీనిపై అధిష్టానం అసంతృప్తితో ఉందని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై ఈటల రాజేందర్ విమర్శలు చేయడం సరికాదని, తెలంగాణ వచ్చాకే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు.
పార్టీతో అనేకరకంగా లబ్ధిపొందిన ఈటల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2003లో ఈటల రాజేందర్ పార్టీలో చేరారు. పార్టీలో ఈటల చేరకముందే ఉద్యమం ఉధృతంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి మంత్రివర్గంలోనే ఈటలకు చోటు దక్కిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ఈటల రాజేందర్‌కు ఏం తక్కువైందో తమకు అర్థం కావడం లేదన్నారు. పేదలకు, దళితులకు ప్రభుత్వం కేటాయించిన భూమిని కొనకూడదని ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు. 66 ఎకరాల అసైన్డ్ భూమిని కొన్నానని ఈటలనే స్వయంగా చెప్పారు. వ్యాపార విస్తరణ కోసం కొనుగోలు చేసినట్లు ఈటలే చెప్పారు అని గుర్తు చేశారు.