- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుగులేని వ్యక్తి సీఎం కేసీఆర్: జగదీశ్ రెడ్డి
దిశ, నల్లగొండ: దేశ రాజకీయాల్లోనే తిరుగులేని నాయకుడు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. సమకాలీన రాజకీయాల్లో సీఎం కేసీఆర్ తిరుగులేని నేత అని, మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను సాధించిన గొప్పనేత అని ఆయన కొనియాడారు. కేసీఆర్ నాయకత్వం కోసం ఇప్పుడు యావత్ భారతదేశం ఎదురుచూస్తోందని చెప్పారు. ఐదు వేల మందితో సరిగ్గా 19 ఏండ్ల క్రితం తెలంగాణ సాధిస్తామన్న ధైర్యంతో ముందడుగు వేశారని, ప్రస్తుతం వారి వెంట మూడున్నర కోట్ల ప్రజానీకం నడుస్తోందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పాలన మొదలు పెట్టిన పది నెలల్లోనే సంచలన విజయాలను నమోదు చేసిందని అన్నారు. కలలో ఊహించని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రాన్ని ధాన్యభాండాగారంగా మార్చిన శిల్పి కేసీఆర్ అని కొనియాడారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్
రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రేఖల భద్రాద్రి, ఐసీడీఎస్ రీజనల్ కో-ఆర్డినేటర్ మాలే శరణ్యారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Tags : Minister Jagdish Reddy, TRS flag, nalgonda, cm kcr, mla bhupal reddy