- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తమ్‌వి మతిలేని మాటలు: జగదీశ్ రెడ్డి
దిశ, నల్లగొండ: ఉత్తమ్ అండ్ కో తమ ఉనికిని కాపాడుకునేందుకు ఆరాటపడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా టెస్టుల విషయంలో ఉత్తమ్‌వి మతిలేని మాటలని దుయ్యబట్టారు. నామా ముత్తయ్య ట్రస్ట్ పేరిట 3 వేల లీటర్ల శానిటైజర్ బాటిళ్లు, 3 వేల మాస్కులను ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జగదీశ్ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యధిక కరోనా పరీక్షలు చేసిన జిల్లాగా సూర్యాపేట నిలిచిందన్నారు. కాంగ్రెస్ నాయకులు కరోనా పోవద్దని కోరుకుంటున్నారని వెల్లడించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి పలు ప్రైవేటు సంస్థలు సాయం అందించడం శుభసూచకమన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, కరోనాపై ఐకమత్యంగా పోరాడితేనే విజయం సాధిస్తామని తెలిపారు. లక్షణాలున్న వారికి కచ్చితంగా పరీక్షలు జరుపుతామని చెప్పారు. అలాగే, రైతులెవ్వరూ ఇబ్బంది పడకుండా ఉండేందుకు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు.
Tags: minister, jagadish reddy, corona, tests, comments, nallagonda