- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్మిక హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి నాయిని : మంత్రి జగదీష్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంపై దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి మహానేత ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నడిచేవని ఆయన గుర్తుచేశారు. శుక్రవారం దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రథమ వర్థంతిని పురస్కరించుకొని లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని పింగళి వెంకటరామ్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దివంగత నాయిని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యం బీద ప్రజల అభ్యున్నతి కోసమే పరితపించిన మహానేత నాయిని నర్సింహారెడ్డి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story