2023 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్: జగదీష్ రెడ్డి

by Shyam |
2023 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్: జగదీష్ రెడ్డి
X

దిశ, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం 2023 నాటికి పూర్తి అవుతుందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ట్రాన్స్‌ కో జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు‌తో కలిసి నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. పవర్ ప్లాంట్ నిర్మాణ దశలో కొందరు గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి ఆపే కుట్రలు చేశారని ఈ సందర్భంగా మంత్రి ఆరోపించారు. అవాంతరాలను అధిగమించి ప్లాంట్ నిర్మాణంలో పురోగతి సాధించామని.. భవిష్యత్ విద్యుత్ అవసరాలను గుర్తించి సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ మొదలు పెట్టారని ఆయన గుర్తు చేశారు. నిర్మాణ పనులు వేగం పుంజుకున్న తరుణంలోనే కరోనా రెండో వేవ్ విజృంభించి పనులకు అవాంతరం ఏర్పడిందన్నారు. ఇప్పటికే అయిదు యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయని, మరో యూనిట్‌కు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందని మంత్రి స్పష్టం చేశారు. పనుల్లో వేగం పెంచేందుకు ట్రాన్స్‌ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ఇతర ఉన్నతాధికారుల సూచన మేరకు కోవిడ్ రక్షణ చర్యలు తీసుకుంటూ, సిబ్బంది కార్మికుల సౌకర్యార్థం ప్లాంట్ ప్రాంగణంలో ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదించామని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story