- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ చట్టాలు కేంద్రానివే.. రైతులకు అన్యాయం చేయం: జగదీశ్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: ‘కేంద్ర ప్రభుత్వం కండిషన్స్ పెడుతూ వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలని చట్టం తెస్తోంది. ఈ చట్టాలపై అభ్యంతరాలుంటే తెలపాలని కేంద్రం కోరింది. ఈ చట్టం వస్తే తెలంగాణలో నిరుపేదలకు అందించే కాజ్ సబ్సిడీలు, సబ్సిడీలు, వ్యవసాయ రంగానికి అందజేస్తున్న24 గంటల ఉచిత విద్యుత్‌తో రైతులకు జరిగే నష్టాలపై సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. కచ్చితంగా మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఉంది. అయితే తెలంగాణ రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.
సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆయన మాట్లాడుతూ సంప్రదాయ ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. గతంలో ఉన్న పాలసీలన్నీ రాష్ట్రానికి నష్టం చేకూరేలా ఉండటంతో సీఎం కేసీఆర్ డెవలపర్లతో సమావేశం నిర్వహించి అందుకు కావాల్సిన విధివిధానాలను తెలుసుకుని సౌర విద్యుత్‌ను చౌకగా అందించారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డనాటికి సాంప్రదాయేతర ఇంధన వనరులు 72 మెగావాట్లు ఉంటే నేడు 4200 మెగావాట్ల సామర్థ్యాన్ని ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగిందని తెలిపారు.