దళిత బంధుపై ఉన్న విషయం చెప్పిన మంత్రి జగదీష్ రెడ్డి

by Sridhar Babu |   ( Updated:2021-10-27 10:43:16.0  )
దళిత బంధుపై ఉన్న విషయం చెప్పిన మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, యాదగిరిగుట్ట/(ఎం) తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే దళితబంధు పథకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రోజునే దళిత తెలంగాణ, హరిత తెలంగాణ, కోటి ఎకరాల మగణాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారన్నారు. దళితబంధు పథకం అమలులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న యదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో 10 మంది లబ్ధిదారులకు ఆయన యూనిట్లు పంపిణీ చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దళితబంధు ఏ ఒక్క కుటుంబానికో రూ. పది లక్షలు ఇచ్చే పథకం ఎంత మాత్రం కాదన్నారు. ఈ ప్రపంచానికి గొప్ప మార్గదర్శకంగా నిలబడే పథకంగా రుపొందుతుందన్నారు. ఇది ప్రగతిశీల ప్రభుత్వం అని, అన్నివర్గాలను ఒప్పించే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్ఫూర్తిదాయకమన్నారు. అందులో భాగమే దళిత బంధు పథకమని అభివర్ణించారు. ఈ పథకంతో ఆర్థిక వెనుకబాటుతనంతో పాటు సామాజిక అంతరాలు రూపొందించేందుకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed