స్వగృహంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూజలు..

by Aamani |   ( Updated:2020-08-22 05:26:46.0  )
స్వగృహంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూజలు..
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిఏటా వినాయక చవితి రోజున అట్టహాసంగా జిల్లా కేంద్రంలోని బుధవార్ పేట్ ఒకటో నెంబర్ గణేష్ మండలి వద్ద మంత్రి ఘనంగా జరిగే వేడుకల్లో పాల్గొనేవారు. కరోనా నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే పండుగ సంబురాలు జరుపుకున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండంతో దాని ఎఫెక్ట్ గణేశ్ ఉత్సవాలపై పడింది. దీంతో అందరూ ఇంట్లో పూజలు నిర్వహించుకుంటున్నారు. ఈ ఏడాది మట్టి విగ్రహాలను ఎక్కువగా వినియోగించడం సంతోషకరమని మంత్రి వివరించారు. నిర్మల్ జిల్లాలోని క్లిమామ్, అల్లోల పౌండేషన్ ఆధ్వర్యంలో భారీగా వినాయకులను అందజేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మట్టి విగ్రహాలు, సంప్రదాయ విగ్రహాలతో పర్యావరణ సమతుల్యం ఏర్పడుతుందన్నారు. తన నివాసంలో జరిగిన పూజల్లో భార్య విజయలక్ష్మి, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజానికానికీ మంత్రి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed