- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా తల్లిదండ్రులిద్దరూ క్యాన్సర్ బాధితులే.. మంత్రి హరీష్ ఆవేదన
దిశ, తెలంగాణ బ్యూరో: క్యాన్సర్ వ్యాధి బాధ తనకు బాగా తెలుసని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. తన తల్లిదండ్రులిద్దరూ క్యాన్సర్ బాధితులేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్ హోటల్ దస్ పల్లలో నిర్వహించిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వార్షికోత్సవంలో ఆయన శనివారం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. వ్యాధి నియంత్రణ కోసం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ 8 ఏడ్లుగా సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. సంస్థ ఫౌండర్ చిన్నబాబు సామాజిక కార్యకర్తగా ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అయితే క్యాన్సర్ లో ఎన్నో పరిశోధనలు జరగాలన్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పని చేయాల్సి ఉన్నదని నొక్కి చెప్పారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
రూ. 120 కోట్లతో ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిని స్టేట్ క్యాన్సర్ సెంటర్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అదనంగా 5 ఎకరాలు కేటాయించి 250 పడకలను 450కు పెంచి ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే ప్రమాదం తప్పుతుందని, పీహెచ్సీ పరిధిలోనే స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రెండేళ్లలో ప్రభుత్వం వైద్యంపై రు. 10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నదని చెప్పారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలన్నదే సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధి పై అవగాహన , నిర్మూలనకు గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు తన వంతుగా ఒక నెల జీతాన్ని ఇస్తున్నట్లు మంత్రి హరీష్రావు ప్రకటించారు.