ఇంటింటికీ వచ్చి వ్యాక్సిన్ ఇస్తాం.. మంత్రి హరీష్ కీలక ప్రకటన

by Shyam |
ఇంటింటికీ వచ్చి వ్యాక్సిన్ ఇస్తాం..  మంత్రి హరీష్ కీలక ప్రకటన
X

దిశ, సిద్దిపేట: వ్యాక్సిన్ రెండు డోస్‌లు అందరూ తప్పనిసరిగా వేయించుకోవాలని, జన రద్దీ ప్రాంతాలలో మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. గర్భిణీలు కరోనా టీకాలు తీసుకోవద్దనే అపోహలు వద్దని, అందరూ తీసుకోవచ్చని వైద్యులే చెబుతున్నారని తెలిపారు. మీరు కోరితే ఇంటింటికీ వచ్చి కరోనా టీకాలు వేయిస్తామని హరీశ్ రావు భరోసా ఇచ్చారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట 27వ మున్సిపల్ వార్డు గణేష్ నగర్ లో రూ.15 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనార్థం, ప్రజల మనస్సులో ఉన్నది నెరవేర్చడమే తమ ప్రయత్నం అని పేర్కొన్నారు. వార్డుల్లో యూజీడీ పనులు వెంటనే చేయించాలని అధికారులను ఆదేశిస్తూ.. నల్లా నీళ్ల తరహాలో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేలా గ్యాస్ పైప్ లైన్లు వేయిస్తున్నామని మంత్రి వివరించారు.

ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇచ్చే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.
సురక్షిత సిద్దిపేట కోసం పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్య సిద్దిపేట కోసం అభివృద్ధి పనులు చేస్తున్నామని, ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, వాకింగ్ చేయాలని ప్రజలను కోరారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం త్వరలోనే కల్పిస్తామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed