- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
4 వేల పల్లె దవాఖానలు ఏర్పాటు: మంత్రి హరీష్
దిశ, తెలంగాణ బ్యూరో: మెరుగైన వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్లడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శ్రీ షిర్డీ సాయి జన మంగళం ట్రస్ట్ అధ్వర్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో ఏర్పాటు చేస్తున్న 250 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాజెక్ట్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని ద పార్క్ హోటల్ లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్ రావు హజరై ప్రసంగిస్తూ…మారుమూల ప్రాంతంలో ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు ప్రభుత్వం తరుపున, వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. పేదలకు సేవ చేసేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు.
ప్రస్తుత కాలంలో వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని, దీంతో సీఎం కేసీఆర్ పల్లెల్లోనూ స్పీడ్‌గా ఉచిత వైద్యం అందించేందుకు 4 వేల దవాఖాన్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీంతో పాటు స్పెషాలిటీ వైద్యం అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉండాలని 5 మెడికల్ కాలేజీలను స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 17 కు పెంచారన్నారు. దీంతో ఎంబీబీఎస్ సీట్లను 2,875కు, పీజీ సీట్లను1200కు పెరిగాయన్నారు. ప్రాథమిక దశలో రోగాన్ని గుర్తిస్తే నయం చేయడం సాధ్యమవుతుందన్నారు. కానీ వివిధ కారణాల వల్ల పేదలు చేయి దాటే స్థితిలో ఆసుపత్రికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షుగర్, బీపీ వంటి రోగాలు చిన్న వయసులోనే వస్తున్నాయని, ప్రాథమికంగా గుర్తిస్తే, వ్యాధులు ముదరకుండా అడ్డుకోవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లు పీజీ అడ్మిషన్ పొందేందుకు ఇన్ సర్వీస్ కోటాను కూడా వర్తింపచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చంద్ర భాను సత్పథి, డీ అర్ డి ఓ చైర్మన్ సతీష్ రెడ్డి, జస్టిస్ నవీన్ రెడ్డి,టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, సినీ ప్రముఖులు మోహన్ బాబు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.