రైతు నర్సింలు మృతి దురదృష్టకరం : హరీశ్ రావు

by Shyam |   ( Updated:2020-07-30 03:44:47.0  )
రైతు నర్సింలు మృతి దురదృష్టకరం : హరీశ్ రావు
X

దిశ, గజ్వేల్ :
దళిత రైతు నర్సింలు మృతి దురదృష్టకరమని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు విచారం వ్యక్తంచేశారు. గురువారం గజ్వేల్‌లో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. దళిత రైతు నర్సింలు మృతి బాధాకరమని, ఇది విపక్షాల రాజకీయ ప్రేరేపిత హత్యగా అభివర్ణించారు. శవాలపై పేలాలు ఏరుకునే నీచ రాజకీయాలు చేయొద్దని, స్వలాభం కోసం అమాయకులను బలి పశువులు చేయొద్దని కోరారు. ఇప్పటికైనా విపక్షాలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. మృతుడి భూమిని టీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా తీసుకుందనే ఆరోపణల్లో ఏ మాత్రం నిజంలేదన్నారు. మృతుడి భూమిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సబ్ స్టేషన్ కోసం స్వాధీనం చేసుకున్నారని గుర్తుచేశారు. మృతుడి కుటుంబానికీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి భరోసాఇచ్చారు. మృతుడి కుటుంబానికి ఎక్స్రే‌గ్రేషియాతో పాటు ఎకరం భూమి, తక్షణ సాయం కింద రూ.2 లక్షలు అందజేస్తామన్నారు. మృతుడి కూతురిని ప్రభుత్వ ఖర్చులతో చదివిస్తామని మంత్రి హామీనిచ్చారు. మృతికి గల కారణాలపై లోతైన విచారణ జరిపిస్తామన్నారు. సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్ఠి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed