- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు
దిశ, సిద్దిపేట: టీఆర్‌ఎస్ ఆవిర్భావం.. తెలంగాణ ఆవిర్భావం.. స్వరాష్ట్రం సాధించి పెట్టిన ఘనత మన సిద్దిపేటకు ఉంది అంటూ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎస్ పార్టీకి పురిటి గడ్డ.. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసుకుని 14 ఏళ్ల పోరాటానికి స్ఫూర్తినిచ్చిన నాటి ఉద్యమానికి.. నేటి అభివృద్ధికి దిక్సూచి మన సిద్దిపేట. టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించి 20 ఏళ్ళు అయిన సందర్భంగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు పార్టీ పునర్నిర్మాణం చేపట్టినారు. ఈ నెలలో వరంగల్‌లో విజయ గర్జన సందర్భంగా కమిటీలు వేశారు. రాబోయే 10 రోజుల్లో అన్ని గ్రామాల పార్టీ కమిటీలు, మండల కమిటీలు, పట్టణములోని వార్డు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామ, మండల పట్టణ కమిటీలు పటిష్టంగా వేయాలని, కొత్త నాయకత్వం, యువతను ప్రోత్సహించాలి’ అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే 10 రోజుల్లో కమిటీలు అన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఆయా మండలాల వారీగా ప్రజాప్రతినిధులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.