వలస కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హరీష్ రావు

by Shyam |
వలస కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హరీష్ రావు
X

దిశ, మెదక్:
పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వలస వచ్చిన కూలీలకు రాష్ర్ట ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రమైన రెడ్డి సంక్షేమ భవన్‌లో 104 మంది వలస కార్మికులకు ప్రతి ఒక్కరికీ 12కిలోల బియ్యం, ఒక్కొక్కరికీ రూ.500 నగదును మంత్రి హరీశ్ రావు, ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ సినీ హాస్య నటుడు శివారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డిలు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి దాకా 10 వేల మంది వలస కార్మికులకు ప్రతి ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం, రూ.500 నగదు అందజేసినట్టు వెల్లడించారు. మరో 8 వేల మంది వలస కార్మికులకు త్వరలోనే అందిస్తామన్నారు. ‘లాక్‌డౌన్ కారణంగా ఇక్కడే ఇరుక్కుపోయామని రంది పడొద్దు. మీరు మా బంధువులేనని, హమ్ సబ్ హిందూస్థానీ అంటూ’వలస కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యత అని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags: Minister Harish Rao, government, support, migrant workers, medak

Advertisement

Next Story