- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ గ్రామ దశ, దిశ మారనుంది..
దిశ, సిద్ధిపేట: డబుల్ బీటీ రోడ్డు నిర్మాణంతో రాజీవ్ రహదారికి అనుకుని ఉన్న నాంచారుపల్లి గ్రామ దశ దిశ మారనున్నదని, రాష్ట్రంలోనే అతిపెద్ద సౌకర్యవంతమైన రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి హరీశ్ రావు అన్పారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం నాంచారుపల్లి స్టేజీ వద్ద రాజీవ్ రహదారి నుంచి కొండంరాజ్‌పల్లి మీదుగా తోర్నాల వరకూ దాదాపు 31కిలో మీటర్ల మేర రూ.23 కోట్ల 34 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం మంత్రి తన్నీరు హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. రూ.23 కోట్ల 34 లక్షలతో తొమ్మిది గ్రామాలను కలుపుకుని 3 మండలాల పరిధిలో 32 కిలో మీటర్ల మేర బీటీ డబుల్ రోడ్డుతో చుట్టుపక్కల మండలాలైన సిద్ధిపేట అర్బన్, చిన్నకోడూర్, నంగునూరు మండలాలతో పాటు దాదాపు 25 గ్రామాల ప్రజలకు ప్రయోజన కరంగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంత్రి వెంట సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కల్పన నర్సింలు, పీఆర్డీఈ వేణు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.