- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేటలో హరీష్ రావ్ మీటింగ్.. ఏమన్నాడంటే ?
దిశ సిద్దిపేట: నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా అమలయ్యేలా చూస్తూనే సీజనల్ వ్యాధుల నియంత్రణకై స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పటిష్ట చర్యలు చేపడుదామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. గురువారం నియోజకవర్గ పరిధిలో మొత్తం 224 మందితో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రజాప్రతినిధులందరికీ మంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వ్యాక్సిన్ల కొరత లేదని అన్నారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వంద శాతం వ్యాక్సినేషన్ జరిగితే మనకు ఏ ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.
ప్రజాసేవలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజారోగ్య పరిరక్షణ కూడా భాగమే అన్నారు. అందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా నిత్యం పర్యవేక్షణ జరపాలని సూచించారు. గత వారం నుంచి వైరల్, డెంగ్యూ.. తదితర సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టే చర్యలు తీసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధులు పెరగక ముందే నిరోధించడానికి సకాలంలో ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మంత్రి హరీశ్ స్థానిక ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు.