రోడ్డు ప్రమాదంలో మరణించిన ANMకు న్యాయం చేస్తాం : మంత్రి హరీష్ రావు

by Shyam |   ( Updated:2021-12-08 05:00:10.0  )
రోడ్డు ప్రమాదంలో మరణించిన ANMకు న్యాయం చేస్తాం : మంత్రి హరీష్ రావు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏఎన్ఎం వరలక్ష్మి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తూ, పుల్లూరు గ్రామం‌లో కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి తన స్కూటీపై వెళ్లి లారీ ఢీ కొన్న ఘటనలో ఆమె మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వరలక్ష్మి మృతదేహానికి ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 50 లక్షల రూపాయల బీమా సొమ్ము వరలక్ష్మి కుటుంబానికి ఇవ్వడంతోపాటు, ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, వరలక్ష్మి అవివాహిత. ఆమెకు ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed