లాక్‌డౌన్ పొడిగిస్తే సహకరిద్దాం

by vinod kumar |
లాక్‌డౌన్ పొడిగిస్తే సహకరిద్దాం
X

దిశ, మెదక్: ‘ మనిషి ప్రాణాలకంటే.. ముఖ్యమేది కాదు. సామాజిక దూరంతోనే కరోనాను అడ్డుకోవడం సాధ్యం. లాక్ డౌన్ ముగిసే దాకా ఇంటి నుంచి బయటకు రావొద్దు. ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుంది. పరిస్థితులు అనుకూలిస్తే సరే.. లేదంటే లాక్ డౌన్ పొడగిస్తే సహకరిద్దాం’. అని ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్‌లో మంగళవారం రాత్రి లైట్ మోటారు వెహికిల్, మెకానిక్, మ్యాజిక్ ఆటో అసోసియేషన్లకు చెందిన 325 సభ్యులకు బియ్యం, 8 రకాల నిత్యావసర సరుకులను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ హాస్య నటుడు శివారెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం సిద్దిపేటలో ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు. ప్రభుత్వానికి లాక్ డౌన్ వల్ల తీవ్ర నష్టం వస్తున్నా.. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని బాధ్యతగా పాటించాలన్నారు.

Tags: minister harish rao, daily needs, distribution, ts news

Advertisement

Next Story

Most Viewed