- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ అవసరాలన్నీ తీరుస్తా.. గెల్లును గెలిపించండి : మంత్రి హరీష్ హామీ
దిశ, జమ్మికుంట : తెలంగాణ తొలి ఉద్యమ కాలం నుంచి మలి ఉద్యమం వరకు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఉద్యోగుల కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా హరీష్ రావు విచ్చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ జైత్రయాత్ర.. లేదంటే శవయాత్ర అనే నినాదమిచ్చి పట్టుదలతో ఆమరణ దీక్షకు బయలుదేరిన సీఎం కేసీఆర్ మొండి ఘటం అని అభివర్ణించారు. 14, 15 ఏళ్ల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ వస్తే అంతా చీకటేనని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెబితే.. ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చేలా రాష్ట్రం ఎదిగిందని వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బతికుండగా చూస్తామా.? అని చాలామంది ఎద్దేవా చేశారని, మల్లన్నసాగర్, కొండపోచమ్మ వివరాలు సేకరిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు అవహేళన చేశారని అన్నారు. కానీ, కాళేశ్వరం తొలి ఫలితం హుజురాబాద్‌కే దక్కిందని, గత ఎండ కాలం ఎన్ని పంటలు పండాయో చూశారు కదా అని వివరించారు.
దేశంలో అధిక ధాన్యం పండించే పంజాబ్‌ను అధిగమించి తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని,
3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించారని వెల్లడించారు. 70 ఏళ్లలో సాధ్యంకాని పనులెన్నో పూర్తి చేసుకున్నామని, ఇప్పుడు సీఎం కేసీఆర్ విద్య, వైద్యంపై దృష్టి పెట్టారని స్పష్టం చేశారు. ఆర్టీసీకి ఏడాదికి 2 వేల కోట్లు ఇచ్చి సీఎం కాపాడుతుంటే.. కేంద్రం రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అమ్ముతోందని ఆరోపించారు.
అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతుంటే.. మన ముఖ్యమంత్రి మాత్రం కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. యాదాద్రి, భద్రాద్రి లాంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నెలకొల్పి.. సీఎం ప్రభుత్వ ఆస్తులు పెంచుతున్నారని చెప్పుకొచ్చారు. ఆస్తులను పెంచేవాళ్లను నమ్మాలా ? అమ్మేవాళ్లను నమ్మాలా? అని ప్రశ్నించారు.
ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే.. ఇప్పటికే మూతపడేది కదా..? ఈ విషయంపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హుజురాబాద్ ప్రజలకు ఎవరు గెలిస్తే మేలు జరుగుతుందో ఆలోచించాలన్నారు. డీజీల్ ధరల పెంపుతో రైతుల మీద మరింత భారం పడిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ 30 శాతం ఫిట్‌మెంట్ ఉద్యోగులకిస్తే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు కేవలం 7.5 శాతమే ఇచ్చిందని, కేంద్రం ఏ రంగానికి మేలు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.
బండి సంజయ్ బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి.. ఈ ప్రాంతంలో చిన్న పనైనా చేసారా? మీరే గమనించాలని పేర్కొన్నారు. కేసీఆర్‌కు దండం పెట్టి అయినా హుజురాబాద్‌కు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ తెస్తానని హామీ ఇచ్చారు. ఒక వేళ ఈటల గెలిస్తే.. వ్యక్తిగా ఆయనకు మేలు జరుగుతుందని.. హుజురాబాద్ ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుందని అన్నారు. 2 లక్షల 29 వేల మందికి మేలు జరగాలా.. ఒక్క ఈటలకే మేలు జరగాలా.. మీరే చెప్పాలంటూ ప్రశ్నించారు.
ఈటలకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే కోపంతో నాపై కూడా అవాక్కులు, చవాక్కులు మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. నేను ఆరుసార్లు గెలిస్తే.. ఐదుసార్లు ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయని, ఒక్కసారి గాలి రావచ్చు.. ఇన్నిసార్లు గెలుస్తామా.. అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.
గెల్లు శ్రీనివాస్ చాలా పేదోడు.. ఆయనకు రెండు గుంటల ఆస్తి మాత్రమే ఉంది. ఆయనకున్న ఆస్తిని చూసి కాదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని చూసి కేసీఆర్ టికెట్ ఇచ్చారని, అలాంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీ సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తా.. మీరు కూడా గెల్లు శ్రీను విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.