- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజీనామాకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా..?
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఓట్లకోసం పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, ప్రజలు ఎన్నిసార్లు బుద్ది చెప్పినా వారిలో మార్పు రావడం లేదని ధ్వజమెత్తారు. బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌లో కేంద్రం రూ. 1,600 ఇస్తుందని, రాష్ర్టం కేవలం రూ. 400 ఇస్తున్నట్లు బీజేపీ ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్ కిట్ కూడా కేంద్రమే ఇస్తున్నట్లు గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ నిజమే అయితే.. చర్చకు సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు హరీష్ రావు సవాల్ విసిరారు.
బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌పై దుబ్బాక పాత బస్టాండ్ వద్ద ప్రజల మధ్యే చర్చ పెడదామని.. ఒకవేళ బీడీ కార్మికులకు కేంద్రం రూ. 1600 పెన్షన్లు ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు. ఒకవేళ నిరూపించకపోతే బండి సంజయ్ అక్కడే ముక్కు నేలకు రాయాలని, రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు ఎంపీ పదవీకి రాజీనామా చేయాలని హరీష్ రావు సవాల్ విసిరారు. వీటికి సిద్ధమనుకుంటే బీజేపీ నేతలే తేదీని డిసైడ్ చేయాలని తెలిపారు. బీజేపీ నేతలు అబద్దాలు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. బీడీ కార్మికులకు కేంద్రం 16 పైసలు కూడా ఇవ్వడం లేదని హరీష్ రావు తేల్చిచెప్పారు.