- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘కార్తీక్ నా కుమారుడికి పరిచయస్తుడే’

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై, మంత్రి గుమ్మనూరు జయరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మట్లాడుతూ… అయ్యన్నపాత్రుడు పదేపదే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈఎస్‌ఐ స్కామ్ నిందితుడు కార్తీక్ నా కుమారుడికి పరిచయస్తుడే అని అన్నారు. తన కుమారుడు కారు పక్కనున్న ఫొటోను చూపించి, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏసీబీ అధికారులు తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించవచ్చు అని సూచించారు. తన కుమారుడికి కార్తీక్ బెంజ్ కారు ఇచ్చినట్టు అయ్యన్న నిరూపించాలని, లేకపోతే పరువునష్టం దావా వేస్తా అని హెచ్చరించారు. టీడీపీ హయాంలో పార్టీ మారితే రూ.50 కోట్లు ఇస్తామని రాయబారం పంపారని తెలిపారు. డబ్బుకు ఆశపడి తాను విలువలు వదులుకోలేదని అన్నారు. కేవలం కోటి రూపాయల కారును తన కుమారుడు తీసుకుంటాడా అని వెల్లడించారు.