- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయాల నుంచి తప్పుకుంటా.. గంగుల ఓపెన్ సవాల్
దిశ ప్రతినిధి, కరీంనగర్ : నీ హత్యకు కుట్ర చేసిన మంత్రి ఎవరో బహిరంగంగానే ప్రకటించు, నీవు చేసిన వ్యాఖ్యలు నిజమైతే నేను రాజకీయాల్లోంచి తప్పుకుంటా, అబద్దం అయితే నువ్వు తప్పుకుంటావా అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను హత్య చేసేందుకు జిల్లా మంత్రి స్కెచ్ వేశారంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈటల రాజేందర్ చెవిలో చెప్పిన ఆ మాజీ నక్సలైట్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించాలని డీజీపీని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే దర్యాప్తుపై నమ్మకం లేకుంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అయినా ఇన్వెస్టిగేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌లు.. ఈటల హత్య ఆరోపణలపై విచారణ చేయించేందుకు చొరవ చూపాలని గంగుల కమలాకర్ కోరారు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం చేయించలేకపోతే ఈటల రాజేందర్ లేఖ ఇస్తే సీఎంకు పంపించి దర్యాప్తు చేయించడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. ఆయన హత్యకు కుట్ర చేశారన్న ఆరోపణలపై వాస్తవాలు చెప్పే వరకూ నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
నీకు చెవిలో ఎవరు చెప్పారో కానీ.. నీకేం భయం లేదని, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను భయపడవద్దని సూచించారు. ఈటల రాజేందర్ నిండు నూరేళ్లు బ్రతికి ఉండాలని ఆకాంక్షిస్తున్నాని.. ఆయనకు, మాకు భూమి పంచాయతీలు కానీ ఆస్థి పంచాయతీలు కానీ లేవన్నారు. కేవలం రాజకీయ వైరుధ్యంతో ఉన్న శతృత్వమే తప్ప కక్షలు పెట్టుకునేంత సీన్ మాత్రం లేదని గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈటల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా, ప్రజలు భయపడే విధంగా ఉన్నాయన్నారు.
ఈటల రాజేందర్ తన మనుషులతోనే తనపై దాడి చేయించుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని గంగుల కోరారు. తెలంగాణలో రాజకీయ కక్షలు హత్యలు చేసుకునేదాకా ఉన్నాయా అనే అనుమానాలు ప్రజలకు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ భేషుగ్గా ఉందని, అయినా మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారన్నారు.
ఇది కేసీఆర్ ప్రభుత్వం. ఇక్కడ రాజకీయ హత్యలు, దాడులు ఉండవని, ఉంటే గింటే రాజకీయ ఆత్మహత్యలే ఉంటాయన్నారు. తనను ఏం అన్నా పట్టించుకోనని, కేసీఆర్‌ను విమర్శిస్తే మాత్రం స్పందిస్తామని గంగుల స్పష్టం చేశారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో అలాంటి సంస్కృతి లేదన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈటల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆరోపణలు సానుభూతి కోసమే చేసినట్టు రుజువైతే మాత్రం ఈటల రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? నిజమైతే నేను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని గంగుల సవాల్ విసిరారు.
నా మీద ఇలాంటి కేసులు, ఆరోపణలు ఇప్పటి దాకా లేవని, కానీ ఈటల మీద ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నారు. ఎంత మంది మీద కేసులు పెట్టించావో, ఎందరిని జైలుకు పంపించావో, ఎంతమందికి రోకలి బండలు ఎక్కించావో నీకే తెలియాలన్నారు. ఈటల చేసిన ఈ ఆరోపణల్లో దోషైనా దొరకాలని, లేదంటే ఈటల తప్పుడు వ్యాఖ్యలు చేశానని అయినా ఒప్పుకోవాలన్నారు. ఇలాంటి రాజకీయాలు మంచిది కాదని.. తెలంగాణలో లేని సంస్కృతికి ఈటల తెరలేపే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా, ఓడిపోతానని ఆయనకు తెలిసిపోయినందు వల్లే కొత్త డ్రామాకు తెరతీశాడని గంగులు కమలాకర్ వ్యాఖ్యానించారు.