తెలంగాణపై ఎందుకీ వివక్ష.. కేంద్రంపై గంగుల ఫైర్

by Sridhar Babu |
తెలంగాణపై ఎందుకీ వివక్ష.. కేంద్రంపై గంగుల ఫైర్
X

దిశ, కరీంనగర్ సిటీ: తెలంగాణలో ఉత్పత్తి అయ్యే వరి ధాన్యం ఇకముందు కొనుగోలు చేయమని ప్రకటించడం.. రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేయడమేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయము అంటే యాసంగిలో పండించిన పంటనంతా ఎక్కడ దాచుకోవాలని ప్రశ్నించారు. 1.45 కోట్ల టన్నుల దిగుబడి ఈ వానాకాలంలో రాబోతుండగా, కేవలం కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటామనడం.. తెలంగాణపై కనబరుస్తున్న వివక్షకు నిదర్శనమన్నారు. ఇతర రాష్ట్రాల పట్ల ప్రేమ, తెలంగాణ పట్ల శత్రుత్వం ప్రదర్శించడం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలని, భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా అంటూ గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ఈ విషయంలో జోక్యం చేసుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed