- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో కొత్తగా ఎన్ని రేషన్ కార్డులిచ్చారో తెలుసా..?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 3,59,974 రేషన్ కార్డులు ఇచ్చామని, ఇంకా 4,88,775 పెండింగ్‌లో ఉన్నాయని పౌర సరపరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరోనా కారణంగా గతేడాది ఈ విషయంలో సిబ్బంది పనిచేయలేకపోయారని చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద సుమారు 9.41 లక్షల మేర కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అందాయని, ఇందులో 92,897 దరఖాస్తులను తిరస్కరించినట్లు వెల్లడించారు. వరుసగా మూడు నెలల పాటు రేషను తీసుకోకపోతే వారు చనిపోయినట్లుగానే భావించాల్సి ఉంటుందని, అలాంటి కార్డుల్ని రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రిపై విధంగా బదులిచ్చారు.
వాడివేడి చర్చ
కొత్త రేషను కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండడంపై సభ్యులకు, మంత్రికి మధ్య వాడివేడి చర్చ జరిగింది. మూడేళ్ళుగా దరఖాస్తుల్ని పరిశీలించకుండా పెండింగ్‌లో పెట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మజ్లిస్ ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, బలాలా అసెంబ్లీ వేదికగా మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. కరోనా సమయంలో చాలా మంది నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లిపోయారని, వారు తిరిగి రావడానికి నాలుగు నెలల సమయం పట్టిందన్నారు. వీరి రేషన్ కార్డులను అధికారులు తొలగించారని, ఇది సహేతుకం కాదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దానికి సమాధానంగా వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకపోతే వాటిని రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని, అవి అర్హత కోల్పోయినట్లు లేదా లబ్ధిదారులు మరణించినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుని పునరాలోచిస్తామని మంత్రి బదులిచ్చారు.
కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
హైదరాబాద్‌లో ఇప్పటివరకు కొత్త కార్డులు ఇవ్వలేదని సభ్యులు పేర్కొనడం వాస్తవం కాదని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి వివరించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 4.88 లక్షల దరఖాస్తుల పరిశీలనను త్వరలో పూర్తిచేసి అర్హత కలిగినవాటిని మంజూరు చేస్తామని చెప్పారు. మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని సభ్యులు కొత్త కార్డుల ప్రాసెస్‌కు ఎన్ని రోజులు పడుతుందని ప్రశ్నించారు. రేషన్ తీసుకోకుండా డిలీట్ అయిపోయిన కార్డులను ఎప్పటికి రీస్టోర్ చేస్తారని ప్రశ్నించారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిమితులతో కొన్ని పనులు ఆశించిన స్థాయిలో సాగలేదని, సభ్యుల సూచన మేరకు ఈ దిశగా కసరత్తు చేస్తామని మంత్రి బదులిచ్చారు.
సిద్దిపేట జిల్లాలో 24,300 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే అందులో 9,700 దుబ్బాక నియోజకవర్గంలోనే ఉన్నాయని, దీర్ఘకాలంగా అప్రూవ్ కాలేదని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రస్తావించారు. దానికి సమాధానంగా గడచిన మూడేళ్లలో మెదక్ జిల్లాలో 7,517 కార్డుల్ని ఇచ్చామని, మరో 4,411 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, సిద్దిపేట జిల్లాలో కార్డులు ఇవ్వలేదంటూ ఆర్టీఐ సమాచారాన్ని రఘునందన్ రావు ప్రస్తావిస్తున్నారు కానీ, 10,336 కార్డులను ఇప్పటికే మంజూరు చేశామని, మరో 7,850 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి వివరించారు.