- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగరంలో డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే ఫ్రీక్వెన్సీ: ఈటల
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కొవిడ్ పరీక్షలు చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఇందు కోసం హైదరాబాద్‌లో 11 సెంటర్లలో పరీక్ష కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిన్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాల్లోని మెడికల్ కాలేజీలను కరోనా చికిత్స అందించేందుకు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. టిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో సిబ్బంది ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సర్వెలేన్స్, డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే ఫ్రీక్వెన్సీ పెంచాలని సూచించారు. కరోనా లక్షణాలు తక్కువగా ఉండే పాజిటివ్ పేషేంట్స్ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని, వారికి ఉదయం, సాయంత్రం విధిగా కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇంటి వద్దకే వైద్యులను పంపించాలని సూచించారు.
హైదరాబాద్‌లో కింగ్ కోఠి ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రి, నేచర్ క్యూర్ హాస్పిటల్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి (ఎర్రగడ్డ), హోమియోపతి ఆసుపత్రి(రామంతపూర్), నిజామియా టీబీ ఆసుపత్రి (చార్మినార్), కొండాపూర్, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రులు, నాచారం, సరూర్ నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉంటాయని మంత్రి ఈటెల వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు టెస్టింగ్ సెంటర్లకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.