మీరు అట్ల చేయొద్దు.. నేనిస్తున్నా తీసుకోండి: ఎర్రబెల్లి

by Shyam |
మీరు అట్ల చేయొద్దు.. నేనిస్తున్నా తీసుకోండి: ఎర్రబెల్లి
X

దిశ, వరంగల్: ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన వ‌ల‌స కూలీల ద్వారా క‌రోనా గ్రామాల్లో విస్తరిస్తోందని, ప్ర‌జ‌లు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.
వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం దౌల‌త్ న‌గ‌ర్ శివారు‌ టూక్యా తండాలో ఆయన ఉపాధి హామీ ప‌నుల‌ను పరిశీలించారు. అక్క‌డి కూలీల‌తో మాట్లాడి ఉపాధి హామీ ప‌నులు ఎలా జ‌రుగుతున్నాయి, ఏయే ప‌నులు చేస్తున్నార‌ని ఆరా తీశారు. క‌రోనా నేపథ్యంలో కూలీల‌కు మాస్కులు లేక‌పోవ‌డంతో వెంట‌నే త‌మ వ‌ద్దనున్న మాస్కుల‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీలో కూలీలంద‌రికీ ప‌ని క‌ల్పించాల‌ని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలిపారు. కొత్త‌గా కూలీల‌కు జాబ్ కార్డులు కూడా ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం అధికారుల‌ను ఆదేశించిందన్నారు. కూలీలు క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా స్వీయ నియంత్ర‌ణ‌, ప‌రిశుభ్ర‌త‌ పాటించాలన్నారు. మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తూ, ఉపాధి ప‌నులు చేయాలన్నారు. ప‌నులు జ‌రిగేట్లుగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి రేట్ల‌ను కూడా ప్ర‌భుత్వం పెంచిందని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed