ఆరోగ్యకరమైన వాతావరణమే కేసీఆర్ లక్ష్యం

by Shyam |
ఆరోగ్యకరమైన వాతావరణమే కేసీఆర్ లక్ష్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి గ్రామంలో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రకృతివనం, చెత్తను వేరు చేసే డంపింగ్‌యార్డు, వైకుంఠ ధామాల కార్యక్రమాలను చేపట్టామన్నారు. గ్రామ పంచాయితీ కార్యకలాపాల పనితీరు మెరుగు, పర్యవేక్షణ కోసం పంచాయితీరాజ్‌శాఖ రూపొందించిన రెండు యాప్‌లను ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ పంచాయితీ కార్యదర్శి రోజువారీ, నెలవారీ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి పీఎస్‌ యాప్‌ అభివృద్ది చేశామని, రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణకు ఇన్‌స్పెక్షన్‌ అధికారి యాప్‌ తయారు చేశామని వెల్లడించారు.

పంచాయతీలకు నగదు పురస్కారం

కేంద్ర ప్ర‌భుత్వ నానాజీ దేశ్‌ముఖ్ గౌర‌వ్ గ్రామ స‌భ పుర‌స్కార్, ఫ్రెండ్లీ గ్రామ పంచాయ‌తీ పుర‌స్కార్, దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ పంచాయ‌త్ అవార్డులు పొందిన జెడ్పీ, మండ‌ల‌, గ్రామ పంచాయ‌తీల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ప్రోత్సాహ‌క న‌గ‌దును అంద‌చేశారు. ఈ మేరకు మొత్తం రూ. 1.47 కోట్ల న‌గ‌దు చెక్కుల‌ను ఇచ్చారు.

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో భాగంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌న్నీ వ‌చ్చే రెండు నెల‌ల్లో పూర్తి చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాల అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలతో హైద‌రాబాద్ నుంచి వీడియో కాన్ప‌రెన్స్‌లో మాట్లాడారు. ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం దేశంలో ఎక్క‌డాలేని విధంగా కేవ‌లం మ‌న రాష్ట్రంలోనే అమ‌ల‌వుతుందని, సీఎం కేసీఆర్ స్వయంగా రూపొందించి అమ‌లు చేస్తున్న ఈ కార్య‌క్ర‌మం దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed