- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి
దిశ, వరంగల్: ప్రజలకు మెరుగైన, నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించాలంటే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. పల్లె ప్రగతికి కొనసాగింపుగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి సోమవారం విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాలను ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన పారిశుద్ధ్యం పనులను పరిశీలించి అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురికి కాలువల నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆయా గ్రామాల సర్పంచ్, కార్యదర్శి, సిబ్బందిని ఆదేశించారు. కాలువలు శుభ్రంగా లేకపోతే, దోమలు, దుర్గంధం పెరిగి, అంటు వ్యాధులు ప్రబలుతాయన్నారు. అనంతరం పర్వతగిరి గ్రామంలో ఆర్టీసీ బస్సును తనిఖీ చేసి పరిశుభ్రతను పాటించాలన్నారు. మాస్కులు లేని ప్రయాణికులను బస్సుల్లోకి అనుమతించొద్దన్నారు. అలాగే సోమారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ నెల 8 లోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి, ధాన్యం కొనుగోలు నిర్ణీత గడువులో ముగిసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్ రూరల్ జిల్లా ధర్మారం గ్రామాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. వెంటనే కమిషనర్ తో మాట్లాడారు. పారిశుద్ధ్యం నిర్వహణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.