- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆ చట్టం విజయవంతం కావాలని కోరుకున్న’
దిశ ప్రతినిధి, నల్లగొండ: తన ఇష్ట దైవమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. మంత్రి ఎర్రబెల్లికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని నా ఇష్ట దైవమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు.
అంతేగాకుండా సీఎం కేసీఅర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం విజయవంతం కావాలని కోరుకున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో యాదాద్రి దేదీప్యమానంగా తయారు అవుతుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మార్గ నిర్దేశనంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందని వివరించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఎమ్మెల్యే గొంగడి సునిత తదితరులు ఉన్నారు.