జగన్ పాలనలో ఏపీ సుభిక్షం : మంత్రి అనిల్

by srinivas |
జగన్ పాలనలో ఏపీ సుభిక్షం : మంత్రి అనిల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల కళ్లలో ఆనందం వెల్లువిరిస్తోంది. సీఎం జగన్‌ అడుగుపెట్టిన వేళా విశేషం ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సంతోషం వ్యక్తంచేశారు.ఈ సంవత్సరం ఏపీలోని 12 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని.. శనివారం పులిచింతల నుంచి నీరు విడుదల చేస్తామన్నారు. గతనెల 27 నుంచి పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని, దీని ద్వారా రాయలసీమలోని అన్ని ప్రాజెక్టుల్లో నీటిని నింపుతామని మంత్రి స్పష్టంచేశారు.

ఇవాళ మంత్రి అనిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా కరువుకి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఇప్పటికే రాయలసీమ లిఫ్ట్ టెండర్లు పూర్తి కాగా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం జగన్ వాటిని పూర్తి చేసి చూపిస్తారన్నారు. నీటి పంపకాల్లో మాకు వివాదాలు అవసరం లేదని.. ఏపీకి రావాల్సిన వాటా నీటిని మాత్రమే వినియోగించుకుంటామన్నారు. సీఎం జగన్ వలన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రుజువైందన్నారు. గోదావరి వరద పై ప్రతిపక్ష టీడీపీ చౌకబారు ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. విపత్కర సమయంలోనూ చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు హైదరాబాద్ వెళ్లి దాక్కున్నారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed