- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్‌పై మూడు రోజుల్లో నిర్ణయం: మంత్రి అనిల్
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా లాక్ డౌన్ పై మూడు రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్యాంపిల్స్ సేకరణకు సంజీవిని బస్సులు ప్రవేశ పెట్టామన్నారు. టెస్టింగ్ ఫలితాలు 36 గంటలలోపు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పాజిటివ్ వచ్చి దీర్ఘ కాలిక రోగులకు ప్రత్యేక అసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్ రోగులః భోజనం విషయంలో నాణ్యత పెంచుతున్నట్లు వెల్లడించారు. కాల్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి నెంబర్లు రోగులకు తెలిసే విధంగా డిస్ ప్లే చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
అక్కడక్కడ చిన్నచిన్న లోపాలు ఉంటాయి కానీ కొంతమంది జర్నలిస్టులు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. మాఇంట్లో పనిచేసే సిబ్బందికి కూడా పాజిటివ్ వచ్చిందని, అయినా తాము వచ్చి పని చేస్తున్నామని ఆయన అన్నారు. అయితే జూమ్ పార్టీ బయటకు రాకుండా విమర్శలు చేస్తుందని టీడీపీని ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు.