- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్షలకు లక్షలు టాయిలెట్ల పాలు
దిశ, అల్వాల్: స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా జీహెచ్‌ఎంసీ అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు బహిరంగా ప్రదేశాలలో మలమూత్రాలు విసర్జించకుండా పబ్లిక్ ప్రదేశాలలో ఎక్కడికక్కడ టాయిలేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్ఇందిరానగర్నుండి మచ్చబొల్లారం డివిజన్ కౌకూర్ వరకు వంద వరకు పబ్లిక్ టాయిలేట్లు నిర్మించారు.
జీహెచ్ఎంసీ అధికారులు హడావుడిగా నిర్మించి నీటి కనెక్షన్ ఇవ్వలేదని, వాటి నిర్వహణ పట్టించుకోకపోవటంతో లక్షలాది రూపాయలు వృథా అయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసినప్పటికి, నీటివసతి కల్పించలేదని స్థానికులంటున్నారు . ప్రణాళికలు లేకుండా ఇలాంటివి నిర్మించి కాంట్రాక్టర్లు, నేతలు, అధికారుల జేబులు నింపటం తప్పితే ఎలాంటి ఉపయోగం ఉండదని మేధావులు విమర్శలు చేస్తు్న్నారు. ఇప్పటికైన జీహెచ్‌ఎంసీ అధికారులు కళ్లు తెరచి పబ్లిక్ టాయిలెంట్ల నిర్వహణను చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.