హతమైన ఉగ్రవాది ఎవరు?

by  |
హతమైన ఉగ్రవాది ఎవరు?
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్‌లోని బుడ్గామ్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చారార్-ఎ-షరీఫ్‌లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న పక్కా సమాచారంతో నిన్న అర్ధరాత్రి నుంచి భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో గుర్తుతెలియని ఉగ్రవాది చంపబడ్డాడని ఓ అధికారి తెలిపారు. హతమైన ఉగ్రవాది ఎవరు? ఏ సంస్థకి చెందిన ఉగ్రవాది అనే వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నట్టు ఆయన వివరించారు. కాగా ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed