- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్‌లో చెక్‌పోస్ట్ వద్ద కలెక్టర్ తనిఖీలు
దిశ, వరంగల్: వలస కూలీలకు ఆశ్రయం కల్పించాలని పోలీసు అధికారులను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం ఆదేశించారు. శుక్రవారం ఆయన మల్హర్రావు మండలంలోని కొయ్యూరు అంతర్ జిల్లా చెక్ పోస్ట్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్‌ను పరిశీలించి ఆ చెక్‌పోస్ట్ ద్వారా సాగుతున్న వాహనాల రాకపోకల వివరాలను పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులతో మాట్లాడుతూ ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చి లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయి మళ్లీ సొంత గ్రామాలకు నడిచి వెళ్తున్న కూలీలను ఆదుకోవాలన్నారు. వారిని గుర్తించి స్థానికంగా భోజనం, వసతి కల్పించాలన్నారు. కరీంనగర్ జిల్లాలో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే జిల్లాలోకి అనుమతించేలా కఠినంగా వ్యవహరించాలన్నారు. అలాగే, జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా ప్రభుత్వ ఆదేశాలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Tags: collector Mohammed Abdul Azim, Migrant workers, shelter, bhupalapalli