- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కస్టమర్లకు మైక్రోసాఫ్ట్ వార్నింగ్..
దిశ, వెబ్‌డెస్క : మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. విండోస్ వినియోగదారులు తమ కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. ఆపరేటింగ్ సిస్టమ్‌లో తీవ్రలోపం బయటపడటంతో సంస్థ వినియోగదారులను అప్రమత్తం చేసింది. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో బయటపడిన తీవ్రమైన లోపాన్ని హ్యాకర్లు ఉపయోగించుకొని డేటాను చోరీ చేసే అవకాశం ఉందని, ఒకవేళ మనం విడోస్ అప్ డేట్ చేసుకోకపోతే హ్యాకర్లు డేటా చోరీకి పాల్పడేందుకు అవకాశమిచ్చినట్లవుతుందని హెచ్చరించింది.
సాధారణంగా ఒకే ప్రింటర్‌ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు విండోస్‌లో ‘ప్రింట్ స్పూలర్’ ఉపయోగపడుతుంది. అయితే, ఇందులో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించామని, ఈ లోపాన్ని అధికమించేందుకు తప్పనిసరిగా ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని దిగ్గజ సంస్థ తెలిపింది. విండోస్ 10 తో పాటుగా, విండోస్ 7 లో కూడా ఈ లోపం ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ సంస్థ పేర్కొన్నది. అందుకే ఈ లోపాన్ని అధికమించాలంటే వినియోగదారులు వెంటనే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ పేర్కొన్నది.