బీజేపీ బలోపేతానికి వైద్య ఎంతో కృషి చేశారు: మోడీ

by Shamantha N |
బీజేపీ బలోపేతానికి వైద్య ఎంతో కృషి చేశారు: మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్ఎస్ఎస్ సిద్దాంత కర్త ఎంజీ వైద్య మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు ఆర్ఎస్ఎస్‌కు వైద్య విశిష్ట సేవలు అందించారని అన్నారు. బీజేపీని బలోపేతం చేయడానికి ఎంజీ వైద్య ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన మరణం తనను కలిచి వేసిందని మోడీ ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంజీ వైద్య మృతి పట్ల కేంద్రమంత్రి గడ్కరీ నివాళులు అర్పించారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎం.జీ వైద్య అందించిన సేవలను ఆయన కొనియాడారు. సంఘ్‌ సైద్ధాంతిక నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు.

Advertisement

Next Story