- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో అదనంగా రూ. 2,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న ఎంజీ మోటార్స్!
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా, వచ్చే ఏడాది చివరి నాటికి రూ. 2,500 కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ తన కొత్త మీడియం రేంజ్ ఎస్‌యూవీ ఆస్టర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వాహన తయారీలో అవసరమైన చిప్‌ల కొరత కారణంగా గతేడాది దెబ్బతిన్న అమ్మకాలు, ఈ ఏడాదిలో వంద శాతం పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. ‘ఇప్పటికే ఎంజీ మోటార్ ఇండియా రూ. 3,000 కొట్ల పెట్టుబడులు పెట్టాము. 2022 చివరి నాటికి అదనంగా మరో రూ. 2,500 కొట్లను ఇన్వెస్ట్ చేయనున్నాము.
దీనిద్వారా భారత్‌లో మొత్తం తమ పెట్టుబడులు రూ. 5,500 కోట్లకు చేరుకుంటాయని’ ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా అన్నారు. ఈ ఏడాది దీపావళికి తన కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఆస్టర్ కొత్త మోడళ్లను తీసుకురానున్నాం. దీని ద్వారా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం మరింత విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ నెలవారీగా 4,000-4,500 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని, వచ్చే ఏడాదికి దీన్ని నెలకు 7,000 యూనిట్ల ఉత్పత్తిని సాధిస్తామని రాజీవ్ తెలిపారు. సరఫరాతో పాటు ప్రత్యేకించి సెమీ కండక్టర్ల కొరత ఉత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని కంపెనీ వివరించింది.