వాటితో ప్రేమలో పడిన వ్యక్తి.. ఏకంగా 15 ఏళ్లు కష్టపడి గిన్నిస్ రికార్డ్!

by Shyam |
వాటితో ప్రేమలో పడిన వ్యక్తి.. ఏకంగా 15 ఏళ్లు కష్టపడి గిన్నిస్ రికార్డ్!
X

దిశ, ఫీచర్స్: డిస్నీ మీడియా ఫ్రాంచైజీలో వచ్చిన ‘కార్స్’ అనే సీజీఐ- యానిమేటెడ్ ఫిల్మ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్త అభిమానులున్న విషయం తెలిసిందే. 2006లో ‘కార్స్’ చిత్రంతో దీని హవా ప్రారంభం కాగా.. దీనిని పిక్సర్ నిర్మించింది. అయితే ఈ మూవీ సిరీస్‌కే కాదు ఇందులోని కార్లకు చిన్నా,పెద్దా తేడాలేకుండా ఫ్యాన్స్ ఉన్నారు. మెక్సికోకు చెందిన జార్జ్ అరియాస్ మాత్రం ఆ కార్లతో ప్రేమలో పడిపోయాడు. ఈ క్రమంలోనే డిస్నీ ‘కార్స్’ సేకరించడం మొదలుపెట్టిన ఆయన, ప్రపంచంలోనే అతిపెద్ద కలెక్టర్‌గా నిలిచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాడు.

జార్జ్ అరియాస్ సేకరణ 2006 నుంచే మొదలైంది. 15 ఏళ్లుగా అతడి సేకరణ పెరుగుతూనే ఉండగా, దీనికి ప్రేరణ తన కూతురేనని అతడు తెలిపాడు. తన కూతురు ఆడుకోవడానికి కార్లు కావాలని అడగడంతో.. కార్స్ సినిమాలోని మెక్‌క్వీన్, సాలీ, మేటర్, చిక్ హిక్స్ పాత్రలకు చెందిన కార్స్ కొనుగోలు చేయమని అడగడంతో అతని సేకరణ ప్రయాణం ప్రారంభమైంది. అలా మొత్తంగా 1200 కార్లను సేకరించిన అతడు గిన్నిస్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు పొందాడు. కార్లను సేకరించడంతో పాటు, వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు.

15 ఏళ్ల క్రితం కొన్న కార్లు కూడా ఇప్పటికి ఎంతో కొత్తగా ఉంటాయి. వాటిని గాజు అల్మారాల్లో భద్రపరిచాడు. జార్జ్ సేకరించిన కార్లను చూడటానికి నిత్యం సందర్శకులు వస్తుంటారు. అంతేకాదు మెక్సికో నలుమూలల నుంచి వచ్చే పిల్లలు తమ పుట్టినరోజును అద్భుతమైన డిస్నీ కార్ల ప్రపంచంలో జరుపుకుంటారు. జార్జ్ సేకరణతో స్ఫూర్తిని పొందిన ఎంతోమంది చిన్నారులు తాము కూడా కార్ల కలెక్షన్ మొదలుపెట్టారు. జార్జ్ రికార్డ్ తెలుసుకున్న డిస్నీ సంస్థ నిర్వాహకులతో పాటు, కారు డైరెక్టర్ బ్రియాన్ ఫీ, సహ నిర్మాత ఆండ్రియా అతడిని కలిసి ప్రత్యేకంగా అభినందించడం విశేషం.

Advertisement

Next Story