మెట్రోలో కరోనా నివారణ చర్యలు

by Shyam |
మెట్రోలో కరోనా నివారణ చర్యలు
X

హైదరాబాద్: రాష్ట్రంలోకి కరోనా ప్రవేశించడంతో దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు మెట్రో అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో ఉద్యోగులకు పలు సూచనలు జారీచేశారు. మెట్రో స్టేషన్లు, రైళ్లు, టచ్ ఉపరితల ప్రాంతాలు, ఎస్కలేటర్లు, హ్యాండ్ రైల్స్ మొదలైనవి ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రకటనలు ప్రదర్శించన్నారు. అయితే, ఈ వైరస్ ప్రభావం ఇప్పటివరకు రైడర్‌షిప్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు.

Tags: hyderabad metro, authorities, carona virus, covid-19, prevention, HMR MD, NVS reddy, metro stations, rails

Advertisement
Next Story

Most Viewed