- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనతా కర్ఫ్యూ.. సోషల్ మీడియా ప్రచారాలు ..వాస్తవాలు!
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. అవగాహనా రాహిత్యంతో కూడిన, విపరీతంగా వైరల్ అవుతున్న మెసేజ్‌ల వివరాల్లోకి వెళ్తే.. కరోనా వైరస్ జీవిత కాలం పన్నెండు గంటలు. 12 గంటల తరువాత కరోనా వైరస్ అంతరించిపోతుంది, కాబట్టి ప్రధాని చెప్పినట్టు పద్నాలుగు గంటలపాటు ఇళ్లలోంచి ఎవరూ బయటకు రాకుండా ఉంటే కరోనా స్ప్రెడ్డింగ్ చైన్ తెగిపోతుంది తద్వారా కరోనా అంరించిపోతుంది. అంటూ ఒక మెసేజ్ వైరల్‌గా మారింది.
మరో మెసేజ్ వివరాల్లోకి వెళ్తే.. సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టడమనే ప్రక్రియ చాలా అద్భుతమైనది. సైన్సుతో పాటు జ్యోతిషశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన వ్యక్తి ఈ సూచన చేశారు. ఎందుకంటే.. ఆ సమయంలో చంద్రుడు రేవతి అనే కొత్త ‘నక్షత్రా’నికి వెళుతున్నాడు. ఆ సమయంలో గంటలు, చప్పట్లు కొట్టడాన్ని సంచిత కంపనం అంటారు. ఈ ప్రక్రియ శరీరంలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. అందుకే ఆ సమయంలో చప్పట్లు కొట్టమన్నారు. పర్వతాలపై, పాతశక్తి దేవాలయాల్లో భారీ, గాంగ్ లాంటి గంటలు మోగించడానికి ఇదే కారణం. అంటూ మరో మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరో మెసేజ్‌లో మార్చి 22 అమావాస్య, నెలలో చీకటి రోజు. అన్ని వైరస్, బ్యాక్టీరియా మరియు దుష్ట శక్తులు అటువంటి రోజుల్లో గరిష్ట సామర్థ్యాన్ని మరియు శక్తిని కలిగి ఉంటాయి. ఒకేసారి 130 కోట్ల మంది చప్పట్లు కొట్టడం ద్వారా షాంక్ నాడా మొదలైనవి చాలా వైబ్రేషన్లను సృష్టిస్తాయి. వాటి ధాటికి వైరస్ అన్ని శక్తిని కోల్పోతుంది. అంటూ ఇంకో మెసేజ్ వైరల్ అవుతోంది.
ఈ మెసేజ్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల్ని మరింత అజ్ఞానంలోకి నెట్టేసేందుకు ఇలాంటి మెసేజ్‌లు కారణమవుతాయని, ప్రజల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి అవాకులు చెవాకులు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తారని.. తాజా ప్రభుత్వ నిర్ణయాల వెనుక శాస్త్రీయమైన ఆలోచనలు ఉన్నాయని, పని వేళల్లో ఇతరలను కలవకుండా చెయ్యడం ద్వారా కరోనా తీవ్రత ఉన్నవారిని గుర్తించవచ్చని, తద్వారా కొంత మేర దానికి అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
24 గంటల కర్ఫ్యూ వెనుక రహస్యమేంటంటే.. రానున్న నెల రోజులు దేశానికి కష్టకాలమని, దానిని దాటాలంటే ముందుగా ప్రజలంతా సిద్ధంగా ఉండాలని దానికి సమాయత్తం చేయడమే తాజా జనతా కర్ఫ్యూ అని నిపుణులు సూచిస్తున్నారు. 24 గంటలు ప్రజలు స్వచ్ఛందంగా నిర్బంధించుకోగలిగితే.. అదే స్ఫూర్తితో మరికొన్ని రోజులు ఇతరులతో సంబంధాలను నియంత్రించుకోగలిగితే కరోనాకు అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు.
ఇక శాస్త్రీయ విశ్లేషణలోకి వెళ్తే.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ప్రిన్స్‌టన్ వర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్ష్‌స డిసీజెస్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (హామిల్టన్), సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తదితర సంస్థల శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం.. కరోనా వైరస్ రాగి ఉపరితలంపై 4 గంటల దాకా, ప్యాకేజింగ్‌కు వాడే అట్టపెట్టెలపై 24 గంటల వరకూ ఉంటుంది. ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తువులపై 2 నుంచి 3 రోజులపాటు, అల్యూమినియం, చెక్క, పేపర్‌పై 5 రోజుల దాకా బతకగలదు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజల అప్రమత్తతే కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Tags: whatsapp university, facebook, twitter, messages, social media, viral message