మేర్లపాక ‘ఆహా’ కథ

by Shyam |   ( Updated:2020-07-17 03:22:00.0  )
మేర్లపాక ‘ఆహా’ కథ
X

టాలీవుడ్‌లో యువ డైరెక్టర్ల హవా నడుస్తోంది. సరికొత్త కథలతో హిట్లు కొడుతూ స్టార్ డైరెక్టర్లకు సవాల్ విసురుతున్నారు. కంటెంట్‌ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. తమను తాము నిరూపించుకుంటున్నారు. మేర్లపాక గాంధీ కూడా ఆ కోవకు చెందినవాడే. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌ మూవీస్ చేసిన గాంధీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం హీరో నితిన్‌తో అంధాధున్ రీమేక్ సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. లాక్ డౌన్ వల్ల కాస్త సమయం దొరకడంతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై దృష్టి పెట్టాడట. అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం కథ సిద్ధం చేశాడట. అడల్ట్ కామెడీ జోనర్‌లో సినిమా తెరకెక్కబోతుండగా, తన దగ్గర పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తారని టాక్. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు, సంతోష్ శోభన్ లీడ్ రోల్స్ చేస్తున్న సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుందని సమాచారం. వైజాగ్‌లోని ఓ రిసార్ట్‌లో త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.

Advertisement

Next Story