మా కూతురి హత్యకు అనుమతివ్వండి..

by Anukaran |   ( Updated:2020-12-04 23:25:24.0  )
మా కూతురి హత్యకు అనుమతివ్వండి..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కోర్టులో మెర్సి కిల్లింగ్ పిటిషన్ దాఖలైంది. తమ కూతురు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోందని, వైద్యం చేయించడానికి తమకు ఆర్థిక స్థోమత లేదని తల్లిదండ్రులు పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆర్థిక సాయం కోసం చాలా రోజులుగా ఎదురు చూశామని, ఎవరూ ముందుకు రాలేదన్నారు. బాధిత కుటుంబం చిత్తూరు జిల్లా మదనపల్లిలోని నీరుగట్టు వారిపల్లికి చెందిన వారు.

రోజురోజుకూ వ్యాధి ముదురు తుండటంతో తమ కళ్ల ముందు బిడ్డ పడుతున్న బాధను చూడలేకపోతున్నామని పిటిషన్‌లో కోరారు. ఎలాగైనా మెర్సి కిల్లింగ్‌కు అనుమతి ఇప్పించాలని కోర్టును వేడుకుంటున్నారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story