- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
దిశ, శేరిలింగంపల్లి : గ్లోబల్ వార్మింగ్‌ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కమిటీ సభ్యులతో కలిసి శిల్పారామంలోని రాక్ హైట్స్ లో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ను శశిథరూర్ ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా పర్యావరణానికి మేలు కలిగించేందుకు మొక్కలు నాటే అవకాశం లభించిదని సంతోషం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు వెళుతుందని, ఇప్పటివరకు 16 కోట్లకు పైగా మొక్కలు నాటడం జరిగిందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీల బృందం మహువా మొయిత్ర, సయ్యద్ జాఫర్ ఇస్లాం, నరేంద్ర జాదవ్, సుమతి తమిజిచ్చీ తంగపాండియన్, ధైర్యశీల్ సంభాజిరావు మానే, శక్తిసింహ్ గోహిల్, నదిముల్ హాక్, పీఆర్.నటరాజన్, సంతోష్ పాండే పాల్గొన్నారు. అనంతరం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎంపీ రంజిత్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని అందజేశారు.