- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్త పారిశ్రామిక విధానానికి సత్వర చర్యలు : మేకపాటి
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టడం ఖాయమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధికి, కొత్తపాలసీ ఖరారుపై వేగం పెంచుతూ మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి మేకపాటి అధ్యక్షతన మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యుత్, నీరు, మానవవనరులు, పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన అన్ని సదుపాయాలు పుష్కలంగా అందించేలా కొత్త పాలసీ తీసుకువస్తున్నట్టు మంత్రి మేకపాటి సహచరులతో పాటు అధికారులకు వివరించారు. జిల్లాలు, రంగాల వారీ ప్రాధాన్యతను బట్టి సమగ్ర పారిశ్రామికాభివృద్ధికి స్పష్టమైన, పారదర్శక విధానం రాబోతుందని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయంతో సమానంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కలిసి కృషి చేద్దామని మంత్రులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాములు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా పాల్గొన్నారు.